ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఓ పాస్టర్ను ఏపీ తిరుపతి అర్బన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
తన కుమార్తెపై చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పరిధిలో పాస్టర్ దేవసహాయం అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి తిరుపతి అర్బన్ పోలీసులకు ఈనెల 12న స్పందన ద్వారా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గురువారం మధ్యాహ్నం తిరుపతి బస్టాండ్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు.