యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(యం) మండలం రాయిపల్లి స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. భువనగిరి నుంచి ఆత్మకూరు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. క్షతగాత్రున్ని చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న టిప్పర్...డ్రైవర్‌కు తీవ్ర గాయాలు - యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం
ఆటోను టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రున్ని చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న టిప్పర్...డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ఆటో డ్రైవర్ తన స్వగ్రామమైన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి నుంచి హైదరాబాదుకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.