అదుపుతప్పిన టిప్పర్ రహదారి పక్కనే ఉన్న ఆటోతోపాటు ప్రయాణికులను ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
ఆటోను ఢీకొన్న టిప్పర్....విద్యార్థులకు గాయాలు - రంగారెడ్డి జిల్లా వార్తలు
అతివేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఆటోతోపాటు ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ధ్వంసం కాగా, విద్యార్థులకు గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద ప్రమాదం జరిగింది.
ఆటోను ఢీకొన్న టిప్పర్....విద్యార్థులకు గాయాలు
బాటసింగారం కూడలిలో బస్సుల కోసం విద్యార్థులు, ప్రయాణికులు వేచి ఉండగా ఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.