తెలంగాణ

telangana

By

Published : Feb 9, 2021, 9:33 AM IST

ETV Bharat / jagte-raho

ఖాజిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం.. గేదె బలి

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. అడవిలో మేత కోసం వెళ్లిన గేదెలపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మూగజీవి మృతి చెందింది.

tiger attack, tiger
ఖాజిపల్లి అడవులు, పులి సంచారం

మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. నర్సింగాపూర్ అడవిలోకి 60 గేదెలను కాపరి మల్లయ్య మేత కోసం తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో హఠాత్తుగా వాటిపై పెద్దపులి దాడి చేసింది. భయంతో కాపరి కేకలు పెట్టాడు. వెంటనే పులి ఒక దానిని వదిలి మరొక జంతువును గాయపరిచి గొల్లవాగు ప్రాజెక్టు వైపు వెళ్లినట్లు కాపరి తెలిపాడు.

ఈ విషయాన్ని వెంటనే ఖాజిపల్లి, నర్సింగాపూర్​కు చెందిన రైతులకు అతను సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ఉన్న పశువులను నర్సింగాపూర్​కు తీసుకు వెళ్లారు. పశువైద్య సిబ్బంది వైద్యం చేస్తుండగా ఒక గేదె అప్పటికే చనిపోయింది. మరొకటి తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది.

అమ్మో.. పులి పాద ముద్రలు

ఇదీ చదవండి:వారం వారం వంటింటి మంట..

ABOUT THE AUTHOR

...view details