ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి శివారులో పులి పశువును హతమార్చిన ఘటన తాజాగా వెలుగు చూసింది. హతమైన పశువు గ్రామానికి చెందిన దాసరి రమేశ్‌కి చెందినదిగా గుర్తించారు.
ఆ ఊర్లో భయం..భయం.. పులి దాడిలో పశువు హతం.. - ఆదిలాబాద్ తాజా వార్తలు
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచరిస్తోంది. తాజాగా పిప్పల్ కోటి శివారులో పశువును పులి హతమార్చింది. దీనితో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.
మళ్లీ ఆ ఊర్లో భయం.. భయం.. పులి దాడిలో పశువు హతం..
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారి గీరయ్య పశువు.. పులి దాడిలో మృతి చెందినట్లు నిర్ధారించారు. పక్షం రోజుల కిందట పులి వరుస దాడుల్లో తాంసి, అంతర్గావ్, కరంజి శివారులో పశువులు మృత్యువాత పడగా.. ఆ తర్వాత పులి కదలికలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజా ఘటన అందరిలో మళ్లీ భయాన్ని రేకెత్తిస్తోంది.