తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వృద్ధునిపై చిరుత పులి దాడి.. స్థానికుల భయాందోళన - గొల్లహట్టిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

చిరుత పులుల సంచారం గ్రామాల్లో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా రోళ్ల మండలంలో మంగళవారం రాత్రి చిరుత పులి ఓ వృద్ధునిపై దాడి చేసింది.

tiger-attack-on-man-in-anantapur-district in ap
నాసేపల్లిలో వృద్ధునిపై చిరుత పులి దాడి

By

Published : Dec 16, 2020, 5:10 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా రోళ్ల మండలం నాసేపల్లిలో ఓ వృద్ధునిపై చిరుత దాడి చేసింది. పాతన్న అనే వృద్ధుడు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన సమయంలో... అతనిపై చిరుత దాడికి పాల్పడింది. కాపాడండి అని బాధితుడు కేకలు వేయగా వదిలేసింది.

నాసేపల్లిలో వృద్ధునిపై చిరుత పులి దాడి

వృద్ధుని కాలికి గాయమవ్వడం వల్ల గ్రామస్థులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగానే ఉన్నారు. అటవీశాఖ అధికారులు అతన్ని పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి:కాసేపటి కిక్కు కోసం కన్నతల్లినే హత్య చేశాడు.!

ABOUT THE AUTHOR

...view details