సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్‌లోని మల్లన్న సాగర్ పంపు హౌజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మల్లన్న సాగర్ నిర్మాణంలో భాగంగా మిడ్ మానేరు నుంచి 300 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కాల్వ పనులకు ఎలాంటి అనుమతులు లేవని... భూములు కోల్పోతున్న రైతులకు ఒక్కో ఎకరానికి రూ.లక్షా యాభై వేలు మాత్రమే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పంప్ హౌజ్ వద్ద జరుగుతున్న పనులను నిరసిస్తూ గ్రామస్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ పంపుహౌజ్ వద్ద ఉద్రిక్తత
మల్లన్న సాగర్ పంపు హౌజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతులు లేకుండా మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు 300 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న కాల్వ పనులు చేస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్థులు పంప్ హౌజ్ వద్దకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది
తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ పంపుహౌజ్ వద్ద ఉద్రిక్తత
పోలీసులు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంఛార్జీ చెరుకు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సుమారు గంట పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Last Updated : Nov 21, 2020, 1:59 PM IST