నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 2 వాహనాలకు నిప్పంటించారు. కమలాకర్‌రావు అనే రైతు ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను తగలబెట్టారు.
ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన దుండగులు - latest news on Thugs set fire to two wheelers at lokeshwaram
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో గుర్తుతెలియని దుండగులు రెండు ద్విచక్రవాహనాలకు నిప్పంటించారు.
![ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన దుండగులు Thugs set fire to two wheelers at lokeshwaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7039535-588-7039535-1588485075300.jpg)
ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన దుండగులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చర్యకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని తమకు నష్ట పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.