విషాదం... పులిగుండాల ప్రాజెక్టులో పడ్డ యువకులు మృతి - తెలంగాణ వార్తలు
15:01 December 20
విషాదం... పులిగుండాల ప్రాజెక్టులో పడ్డ యువకులు మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గుండాలలో ప్రమాదవశాత్తు చెరువులో మనిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా కల్లూరు మండలం బత్తలపల్లికి చెందిన వారు. మృతుల్లో జంగారామ నరసింహారెడ్డి(21), వేమిరెడ్డి సాయి రెడ్డి(21), శీలం వెంకట చలపతి రెడ్డి(23) ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అవులూరి శంకర్ రెడ్డి, వేల్పుల నరసింహారావు, పొదిలి శ్రీనివాసరావు, కలసని ఉపేందర్, వేల్పుల మురళి, కూరాకుల శ్రీకాంత్ చెరువు వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు.
అక్కడే వంట చేసుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు జంగారామ నరసింహారెడ్డి, వేమిరెడ్డి సాయి రెడ్డి, శీలం వెంకట చలపతి రెడ్డి చెరువులో దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో బత్తలపల్లిలో విషాదం అలుముకుంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, మత్స్యకారులు వలతో చెరువులో వెతగ్గా చీకటి పడ్డ తర్వాత మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, ఏసీపీ వెంకటేశ్, ఆర్డీవో సూర్యనారాయణ పరిశీలించారు.
ఇదీ చదవండి:శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారం పట్టివేత