తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైబర్ నేరగాళ్ల కథలు నమ్మితే ఇలా ఉంటుంది! - హైదరాబాద్ సైబర్ క్రైం వార్తలు

ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఓ రూపంలో ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొత్త పంథాతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

cyber crime
cyber crime

By

Published : Aug 11, 2020, 3:40 PM IST

  • సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా... ప్రజలు చిత్తవుతూనే ఉన్నారు. హైదరాబాద్​ సంతోష్ నగర్​కు చెందిన మజురుద్దీన్‌కు తన స్నేహితుడి ఫొటో డీపీతో ఉన్న వాట్సాప్ నుంచి సందేశం వచ్చింది. శస్త్ర చికిత్స నిమిత్తం లక్ష అడిగాడు. వెంటనే మజురుద్దీన్ రూ.60వేలను ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేశాడు. మరుసటి రోజు మిత్రుడికి ఫోన్ చేసి చెప్పగా... తాను డబ్బులు అడగలేదని... ఎవరో మోసం చేశారని అనడంతో మజురుద్దీన్ విస్తుపోయాడు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
  • సీతాఫల్ మండికి చెందిన ప్రవీణ్ కుమార్ ఆన్ లైన్‌లో మూడు ముక్కలాట తరహాలో ఓ గేమ్ ఆడాడు. ఇటీవల ఆటలో గెలిచినా... ఓడిపోయానంటూ రూ.97 వేలు కొట్టేశారని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
  • కొద్దిరోజుల క్రితం ఇర్ఫాన్ షరీఫ్‌కు ఓ ఫోనొచ్చింది. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ కార్డు పంపిస్తామంటూ ఆవతలి వ్యక్తి చెప్పాడు. ఆధార్, పాన్ కార్డుల నకలు పత్రాలు కావాలనగా... పంపించాడు. కొన్ని నెలలు గడిచాయి. రెండు రోజుల క్రితం ఓ బ్యాంక్ నుంచి షరీఫ్‌కు ఫోనొచ్చింది. మీ క్రెడిట్ కార్డుకు సంబంధించి 80వేల బకాయిలు ఉన్నారని... వెంటనే చెల్లించాలన్నారు. షరీఫ్ వెంటనే బ్యాంక్‌కు వెళ్లాడు. వివరాలు పరిశీలించి ఎవరో తనను మోసం చేశారని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details