కన్న కూతుర్నే భారంగా భావించిన తండ్రి రెండో భార్యతో కలిసి హత్యచేసిన ఘటనలో జగిత్యాల జిల్లా కోర్టు ముగ్గురికి యావజ్జీవ శిక్షవిధిస్తూ తీర్పు వెలువరించింది. జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో మౌనశ్రీ అనే వైద్య విద్యార్థిని ఉండేది. ఆమె తండ్రి సత్యనారాయణరెడ్డి, రెండో భార్య లత, రెండోభార్య సోదరుడు రాజు ముగ్గురు కలిసి 2015 సెప్టెంబర్ 9న ఆమెను హత్యచేసి సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు.
కూతురి హత్య కేసులో తండ్రి, సవతితల్లి, మామకు యావజ్జీవం - మౌనశ్రీ హత్య కేసు తాజా వార్తలు
13:23 October 28
కూతురి హత్య కేసులో తండ్రి, సవతితల్లి, మామకు యావజ్జీవం
యువతి తల్లి ప్రేమలత అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సత్యనారాయణరెడ్డికి మొదటి భార్య ప్రేమలతతో 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మౌనశ్రీ పుట్టిన మూడేళ్లకు వారు విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మౌనశ్రీకి పెళ్లి చేయాలని ఒప్పందం చేసుకున్నారు.
సత్యనారాయణరెడ్డి ఇంటికి వెళ్లి ప్రేమలత తరచూ పెళ్లి విషయం ప్రస్తావన చేస్తూ వచ్చేది. పెళ్లి చేస్తే ఉన్న తన ఆస్తి అంతా పెళ్లికే ఖర్చవుతుందని భావించాడు. ఈ నేపథ్యంలో రెండో భార్య లత, ఆమె సోదరుడు రాజుతో కలిసి మౌనశ్రీ హత్యకు పథకం ఆలోచించి కలిసి విషం ఇచ్చి హత్యచేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. గొల్లపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టి హత్యకు సంబంధించిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సత్యనారాయణ రెడ్డి, ఆయన భార్య లత, రాజుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించారు.
ఇవీచూడండి:గొర్రెకుంట మృత్యుబావి కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ నేరం రుజువు