సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో భూవివాదంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తిపోటుకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.
ఘర్షణకు దారి తీసిన భూవివాదం - three injured in land dispute in narayankhed
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో భూవివాదంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కత్తులతో దాడి చేసుకునే వరకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
![ఘర్షణకు దారి తీసిన భూవివాదం three persons injured in land dispute in sangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7189266-360-7189266-1589427379103.jpg)
ఘర్షణకు దారి తీసిన భూవివాదం
నారాయణఖేడ్ మండలం తుర్కపల్లికి చెందిన ప్రవీణ్, అదే తండాకు చెందిన మారుతీ నాయక్ వ్యవసాయ భూములు పక్క పక్కన ఉన్నాయి. వీరిరువురి మధ్య భూములు దున్నే విషయంలో వాగ్వాదం చెలరేగింది.
వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో మారుతీ నాయక్ కత్తి పోటుకు గురికాగా, ప్రవీణ్, అతని సోదరునికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు.