ఏపీలోని నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు... విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. శనివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవగా... హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న వేణుగోపాల్ ఇంటికి శనివారం రాత్రి కొరియర్ సర్వీస్ బాయ్ వచ్చాడు. అతన్ని ఇంట్లోకి రావద్దని... విద్యుత్ తీగలు పడతాయని చెప్పడానికి ప్రయత్నించి బయటకు వచ్చిన వేణుగోపాల్‌పై గాలికి విద్యుత్ తీగలు పడ్డాయి.
కొరియర్ బాయ్‌ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి - nellore latest updates
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో గాలివాన ముగ్గురిని బలికొంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కొరియర్ బాయ్‌ని కాపాడేందుకు... ఓ ఇంట్లో ముగ్గురు మృతి
అతన్ని రక్షించబోయే క్రమంలో అతని తల్లి బుజ్జమ్మ వేణుగోపాల్‌ను పట్టుకుంది. అరుపులకు బయటకు వచ్చిన అతని భార్య వారిద్దరినీ పట్టుకోగా ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ట్రాన్స్‌కో సిబ్బందికి తెలిపి విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.