తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం - ముగ్గురు అదృశ్యం వార్తలు మియాపూర్​

హైదరాబాద్​లో మిస్సింగ్​ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. లాక్​డౌన్​ అనంతరం ఎన్నడూ లేనంతగా అదృశ్యం కేసులు భాగ్యనగరం ఠాణాలో నమోదవుతున్నాయి. తాజాగా మియాపూర్​ పోలీసు స్టేషన్​లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కనపడట్లేదంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. హఫీజ్​పేట్​ ప్రేమ్​నగర్​లో నివాసముంటున్న ముగ్గురు శనివారం సాయంత్రం బయటకు వెళ్లి తిరిగిరాలేదు.

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యం

By

Published : Nov 2, 2020, 9:22 PM IST

హైదరాబాద్ మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమయ్యారు. మియాపూర్‌ పరిధిలోని హఫీజ్‌పేట్‌ ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న 34 ఏళ్ల దీపిక, 14 ఏళ్ల సాయిలిపి, తొమ్మిదేళ్ల చైతన్య శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

రెండు రోజులుగా కుటుంబసభ్యులు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అదృశ్యమైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

ఇదీ చదవండి:మిస్సింగ్​.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!

ABOUT THE AUTHOR

...view details