ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కటాఫ్ ఏరియా.. సింగారం అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరిని మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు మల్లన్నగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది.
కటాఫ్ ఏరియా ప్రాంతంలోని సింగారం అడవుల్లో మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తురన్న సమాచారంతో ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో 12 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మిగిలిన 10మంది తప్పించుకున్నారు.