మల్కాజిగిరిలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం - medchal news
ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి సఫీల్గూడలో చోటుచేసుకుంది. బంధువుల ఇళ్లు, తెలిసిన ప్రదేశాల్లో వెతికిన భర్తకు ఆచూకీ దొరకకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
three daughters and mother missing in malkajigiri
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యం ఘటన కలకలం రేపుతోంది. సఫీల్ గూడలో నివసించే సునీత(38)... తన ముగ్గురు పిల్లలు శివాని(11), శ్రావణి(08), చందన(07)తో కనిపించకుండా పోయారు. భర్త తులసిదాసు తన బంధువుల ఇళ్లలో... తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఫలితం లేదు. చేసేదేమి లేక తులసిదాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టారు.