హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.3.75 కోట్లు హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్లో రోడ్ నెంబర్-12లో భారీగా నగదు తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో... పోలీసులు నిఘా పెట్టారు. రెండు కార్లలో వెళ్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడం వల్ల... దానిని ఆదాయపు పన్ను అధికారులకు అప్పగిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీ కూమార్ తెలిపారు.
హవాలా మార్గంతో తరలిస్తున్న 3 కోట్ల 75 లక్షలు స్వాధీనం - బంజారాహిల్స్లో భారీ నగదు స్వాధీనం
హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును... హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో పోలీసులు పట్టకున్నారు. విశ్వసనీయ సమాచారంతో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు... నగదు స్వాధీనం చేసుకొని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హవాలా మార్గంతో తరలిస్తున్న 3 కోట్ల 75 లక్షలు స్వాధీనం
ముంబయికి చెందిన పీ విజయ్ కంపెనీకి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో శాఖ ఉంది. గిరి, రాథోడ్ అనే ఇద్దరు వ్యక్తుు బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. ముంబయిలో పనిచేసే దిలీప్, హరీష్ హైదరాబాద్కు వచ్చి నగదు తీసుకొని వాహనంలో బయలుదేరారు. పక్కా సమాచారంతో పోలీసులు కారును తనిఖీ చేయగా భారీగా నగదు కట్టలు బయటపడ్డాయి.
ఇదీ చూడండి:లక్ష కోట్ల అక్రమ వ్యవహారంలో హవాలా డీలర్ అరెస్ట్