సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సుధాకర్.. బేగంపేట పీఎస్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శరత్‌కుమార్‌తో కలిసి మద్యం సేవించారు. అనంతరం కుటుంబ సంబంధిత విషయాల్లో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తగాదాల్లో శరత్‌పై సుధాకర్ దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లగా అతనిని సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ - హైదరాబాద్ పోలీస్ సస్పెన్షన్ వార్తలు
మద్యం మత్తులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు గొడవ పడిన ఘటన హైదరాబాద్ చిలకలగూడలో చోటుచేసుకుంగి. ఈ నేపథ్యంలో ఘటనకు కారణమైన చిలకలగూడ కానిస్టేబుల్ సుధాకర్‌తోపాటు అనైతికంగా వ్యవహరించి... దుష్ప్రవర్తనకు పాల్పడిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.
![విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ three constables suspend in hyderabad commissionerate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9345984-776-9345984-1603897121855.jpg)
విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్
శరత్‌బాబుతో పాటు బహదూర్‌పురా కానిస్టేబుల్ బాబురావు, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్‌లో పనిచేస్తున్న కానిస్టేబల్ శరత్‌ను సీపీ అంజనీకుమార్ విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వం అందిస్తున్న వరదసాయానికి సంబంధించి కాలనీవాసులతో... బాబురావు గొడవపెట్టుకోగా కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు శరత్ కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండగా సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.