ప్రాణాలు తీసిన వాటర్ హీటర్.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు
ఏపీలోని కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో తల్లితో పాటు ఇద్దరు కుమారులు మృతి చెందారు.
విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు కుమారులు మృతి
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యంలో తీవ్ర విషాద ఘటన జరిగింది. విద్యుదాఘాతంతో ఓ తల్లితో పాటు ఇద్దరు కుమారులు మృతిచెందారు. సతీశ్, సవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహించేవారు. ఎప్పటిలాగే ఉదయం హీటర్ పెట్టి నీరు కాచే సమయంలో.. విద్యుదాఘాతానికి గురైనట్టు స్థానికులు తెలిపారు. మృతుల్లో తల్లి సవిత(35), చిన్నారులు నిశ్చల్ (10), వెంకటసాయి(6) ఉన్నారు.
- ఇదీ చదవండి :డ్రమ్ములో యాచకురాలి మృతదేహం