తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాళమేసుందని దోచేశారు... సొత్తుతో సహా దొరికిపోయారు - jogipet theft case news

సరదా కోసం బంధువుల ఊరికి వచ్చారు. పగలంతా విందు వినోదాలల్లో మునిగితేలారు. ఇక రాత్రికి ఇంటికి వెళ్లేందుకు చౌరస్తాకు వచ్చారు. బస్సు కోసం వేచి చూస్తున్న తరుణంలో... తాళం వేసి ఉన్న ఓ దుకాణాన్ని చూశారు. అంతే... వెంటనే తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఆ సొత్తుతో జల్సాలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేశారు. మిగిలిన ఇంకాస్త సొత్తును విక్రయించే ప్రయత్నంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

three arrested in theft case in jogipet
three arrested in theft case in jogipet

By

Published : Dec 19, 2020, 4:57 AM IST

సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్​స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒకటిన్నర లక్షలు, యాభై లక్షల విలువైన నగలు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జోగిపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. పుల్కల్ మండలం గ్రామానికి చెందిన శివ, వట్​పల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన కార్తీక్, వరంగల్​కు చెందిన శంకర్ కలిసి హైదరాబాదులో కూలీ సెంట్రింగ్ పనులు చేసేవారు. ఈనెల 6వ తేదీన ఆ ముగ్గురు మల్లి గ్రామానికి బంధువుల ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణం కోసం మరి వెళ్లి చౌరస్తాకు చేరుకున్నారు.

ఆ చౌరస్తాలో వెంకటలక్ష్మి నాగరాజ్ దంపతుల దుకాణానికి తాళం వేసి ఉండడాన్ని గమనించారు. వెంటనే...రాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి నాలుగు తులాల బంగారం నగలు వెండి వస్తువులతో పాటు 60 వేలు నగదు తస్కరించారు. అందులోని ఓ పుస్తెలతాడు పెట్టి వచ్చిన డబ్బులతో ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేశారు. మిగిలిన ఇంకొంత దొంగ సొత్తును జోగిపేట పట్టణంలో విక్రయించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే అనుమానంగా తిరుగుతుండగా... వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు చిక్కారు. నిందితులకు తమదైన శైలిలో పోలీసులు నిర్వహిస్తే... తామే దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు.

ఇదీ చూడండి: ఆదిలాబాద్‌ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం

ABOUT THE AUTHOR

...view details