ఈ నెల 3న వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణ హత్యకు గురైన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారు అభరణాలతో పాటు రూ. 2 లక్షల 71 వేల నగదుతో పాటు 3 చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బు కోసమే మేనత్తను మేనల్లుడు హత్య చేశాడని నగర సీపీ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. నగరంలోని టైలర్ స్ట్రీట్‌లో తన కుమారుడు అఖిల్‌తో కలిసి దోర్నం శారద నివసిస్తోంది. భర్త మరణించగా... బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటుందని తెలిపారు.
డబ్బు కోసం మేనత్తను ఖతం చేసిన కిరాతకుడు - arrest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందుతులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసమే మేనత్తను మేనల్లుడు హత్య చేశాడని నగర సీపీ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. సీసీ కెమెరాల అధారంగా నిందితుడిని గుర్తించి పక్కా సమాచారంతో పట్టుకున్నామని సీపీ తెలిపారు.
శారద అన్న కొడుకు ఆకాశ్‌బాబు ఇద్దరు మిత్రులతో కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవిస్తుండటం వల్ల తండ్రి మందలించేవాడు. గొడవైన ప్రతీసారి మేనత్త ఇంట్లో అశ్రయం పొందేవాడు. ఈ క్రమంలో శారద తన కూతురు కోసం దాచుకున్న డబ్బులను గమనించిన ఆకాశ్... దొంగలించేందుకు ప్రణాళిక రూపొందించాడు. తెల్లవారు జామున ఇంట్లోకి ప్రవేశించి శారద తలపై బండ రాయితో మోది హత్య చేశాడని పోలీసులు తెలిపారు. పక్కనే ఉన్న అఖిల్‌ను కూడా చంపేందుకు యత్నించాడని పేర్కొన్నారు. ఆనంతరం బీరువాలో ఉన్న డబ్బును చోరీ చేసి.. ఇద్దరు మిత్రులతో కలిసి ఆశ్రయం పొందాడని వివరించారు. సీసీ కెమోరాల అధారంగా నిందితుడిని గుర్తించి పక్కా సమాచారంతో పట్టుకున్నామని సీపీ తెలిపారు.