తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 12:30 PM IST

ETV Bharat / jagte-raho

నయీం తమ్ముళ్లు తెలుసా.. ఇలా బెదిరిస్తూ అరెస్టయారు.!​

గ్యాంగ్​స్టర్​ నయీం అంతమైనా.. అతని పేరుతో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నయీం తమ్ముడి పేరుతో ఓ వ్యక్తిని ఫోన్​ చేసి బెదిరించగా ఇద్దరిని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, రిమాండ్​కు తరలించారు.

Threats in the name of Naeem's brother Two arrested by bb nagar police in yadadri bhuvanagiri district
​​ నయీం తమ్ముడి పేరుతో బెదిరింపులు... ఇద్దరు అరెస్ట్​

గ్యాంగ్​స్టర్ నయీం అనుచరులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొరికిన చరవాణి ద్వారా భాస్కర్​ అనే వ్యక్తికి ఫోన్​ చేసి నయీం తమ్ముడినంటూ పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు.

బాధితుడు బీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... యాదగిరిగుట్టకు చెందిన నవీన్​, గణేశ్​లుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై రాఘవేందర్​ తెలిపారు. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భువనగిరి జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.

ఇదీ చూడండి:గన్​తో బెదిరించి... అత్యాచారం చేసి... రికార్డు చేశాడు

ABOUT THE AUTHOR

...view details