మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం తూర్పుతండా, దుబ్బతండా, రేఖ్యాతండా, మేఘ్యాతండాల్లో... అక్రమ గుడుంబా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 30 లీటర్ల గుడుంబా, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు - అక్రమ గుడుంబా స్థావరాల ధ్వంసం
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పలు గిరిజన తండాల్లో ఎక్సైజ్, సివిల్ పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. బెల్లం పానకం, గుడుంబా ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు.
అక్రమ గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
ఈ దాడుల్లో 30 కిలోల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి పాల్పడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్టు తొర్రూరు ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకన్నతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి