మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు శ్రీకాంత్(13) వాగులో శవమై కనిపించాడు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు విగతజీవిగా మారాడు. శుక్రవారం తన కుమారుడు కనిపించడం లేదంటూ కమలమ్మ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
రెండురోజుల క్రితం అదృశ్యం.. వాగులో శవం - బాలానగర్లో శవమైన తేలిన పదమూడేళ్ల బాలుడు
కుమారుడి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసిన ఆ తల్లి ఆశలను నీళ్లు మింగేశాయి. తిరిగి వస్తాడనుకున్న కన్నకొడుకు తిరిగిరాని లోకాలకు చేరాడు. రెండురోజుల క్రితం అదృశ్యమైన పదమూడేళ్ల బాలుడు వాగులో శవమై తేలాడు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలకేంద్రంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.
![రెండురోజుల క్రితం అదృశ్యం.. వాగులో శవం boy died in canal in balanagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10189059-87-10189059-1610274170169.jpg)
ఈతకు వెళ్లి మృతి చెందిన బాలుడు
దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, పోలీసు అధికారులకు దుందుభి వాగు వద్ద బాలుని చెప్పులు, దుస్తులు కనిపించగా.. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున బాలుని మృతదేహం లభ్యమైంది. ఈతకు వెళ్లి చెక్ డ్యాం వద్ద గల్లంతైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.