నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న బాలికను కారు ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందింది. మండలంలోని రాజగట్టుకు చెందిన అంజయ్య కూతురు భవాని(13) డాన్స్ నేర్చుకుని ఇంటికి తిరిగి వస్తుండగా అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై ఘటన జరిగింది.
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. బాలిక మృతి
భవిష్యత్తులో మంచి డాన్సర్ కావాలకునుంది. అందుకు తగిన శిక్షణ తీసుకుంటోంది. రోజులాగే డాన్స్ నేర్చుకునేందుకు వెళ్లింది. కానీ బాలిక పట్ల విధి చిన్నచూపు తీసింది. కారు రూపంలో వచ్చిన మృత్వువు బాలిక కలలను కల్లలు చేసింది. ఇంటికి వెళ్తూ రోడ్డు దాటుతుండగా జరిగిన ప్రమాదంలో తనువు చాలించింది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా దామరచర్ల మండలకేంద్రంలో జరిగింది.
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. బాలిక మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.