భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో విషాదం జరిగింది. సీతారామప్రాజెక్టు కాలువ దాటే క్రమంలో మల్లెల మడుగు గ్రామానికి చెందిన కూనేబోయిన వాసుకుమార్(13) అనే బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. అతని తల్లి ఏడాది క్రితం చనిపోగా, తండ్రి బాలున్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలుడు మృతి - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
చిన్నవయసులోనే తల్లిదండ్రులు దూరమయ్యారు. తల్లి ఏడాది క్రితం చనిపోగా, తండ్రి బాలున్ని వదిలేసి వెళ్లిపోయాడు. వాళ్ల తాతయ్య వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్న అతనిపై అంతలోనే విధి చిన్నచూపు చూసింది. తాతయ్యతో కలిసి మేకలు కాసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు సీతారామప్రాజెక్టులో పడి మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం వద్ద విషాదం జరిగింది.

ప్రమాదవశాత్తు కాలువలో పడి బాలుడు మృతి
వాళ్ల తాతయ్య వద్ద ఉంటూ బాలుడు జీవనం సాగిస్తున్నాడు. తాతయ్యతో కలిసి మేకలు కాసేందుకు వెళ్లి విగతజీవిగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు,రెవెన్యూ అధికారులు ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.