హైదరాబాద్ శివారులో తెల్లవారుజామున దొంగలు హల్చల్ చేశారు. ఘట్కేసర్ ఠాణా పరిధిలోని ఏదులాబాద్ మార్గంలో ఉన్న సౌత్ ఇండియా బ్యాంకు కిటికీ గ్రిల్స్‌ను తొలిగించారు. సైరన్ మోగడం వల్ల భయపడిపోయిన దొంగలు అక్కడ నుంచి పారిపోయారు.
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం - latest crime news in telangana
దొంగలు బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సౌత్ ఇండియా బ్యాంకు కిటికీ గ్రిల్స్‌ను తొలిగించిన దొంగలు సైరన్ మోగటంతో పారిపోయారు.
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. దొంగలు బ్యాంకు లోపలికి ప్రవేశించకపోవటంతో డబ్బులు పోలేదని అధికారులు, పోలీసులు పేర్కొన్నారు. బ్యాంకును మల్కాజిగిరి ఏసీపీ నరసింహ రెడ్డి, సీఐ చంద్రబాబు పరిశీలించారు.