తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఏటీఎంలో చోరీకి దుండగుల విఫలయత్నం - నాచారం క్రాస్ రోడ్​లో కెనరా బ్యాంకు ఏటీఎం

మేడ్చల్​ జిల్లా నాచారం క్రాస్​ రోడ్​ వద్ద కెనరా బ్యాంకు ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. మిషన్​ను పూర్తిగా పగలగొట్టినప్పటికీ... డబ్బులు ఉన్న బాక్స్​ తెరుచుకోకపోవడం వల్ల అక్కడి నుంచి పారిపోయారు.

ఏటీఎంలో చోరీకి దుండగుల విఫలయత్నం
ఏటీఎంలో చోరీకి దుండగుల విఫలయత్నం

By

Published : Aug 12, 2020, 10:56 AM IST

మేడ్చల్ జిల్లా నాచారం క్రాస్ రోడ్ వద్ద కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. పెద్ద బండరాయితో మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేసినా, డబ్బులు ఉన్న బాక్స్ ఓపెన్ కాక పోవడం వల్ల అక్కడి నుండి పారిపోయారు. ఈ రోజు ఉదయం ఏటీఎం వద్దకు వెళ్ళినవారు పోలీసులకు సమాచారం అందించారు. ఏటీఎం సెంటర్ లోని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే దారిలో ఇలా జరగడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ABOUT THE AUTHOR

...view details