నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం పైకప్పును రాడ్‌తో తొలిగించిన ఇద్దరు దొంగలు... లోపల మిషన్ తెరుచుకోకపోవడంతో వెనుదిరిగిపోయారు. బోధన్ పట్టణం నడిబొడ్డున ఉండే కెనరా బ్యాంక్ ఏటీఎం ధ్వంసం చేసి... డబ్బులు కాజేయడానికి దుండగులు రకరకాలుగా ప్రయత్నించారు.
ఏటీఎం చోరీకి నానా తంటాలు.. సీసీ కెమెరాల్లో కేటుగాళ్లు - బోధన్ వార్తలు
ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు వెళ్లిన దుండగులకు నిరాశే ఎదురైన ఘటన బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. ఏటీఎం మిషన్‌ను తెరిచేందుకు చేసిన వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఏటీఎంలో చోరీ కోసం నానా ప్రయత్నాలు చేసిన దుండగులు
మిషన్ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బోధన్‌లో లాక్డౌన్ ముగిశాక వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు.
ఇదీ చూడండి:వనస్థలిపురంలో రెండు ఏటీఎంలలో చోరీ