తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కన్నమేసి... కనబడిందల్లా దోచేస్తారు - theft in yellandu

భద్రాద్రి జిల్లా ప్రజలను ఓ వైపు కరోనా కలవరపెడుతుంటే... మరోవైపు దొంగలు భయపెడుతున్నారు. తలుపులకు గడియ బిగించి పడుకున్నా... కన్నమేసి కనబడిందల్లా దోచేస్తున్నారు. మూడు నెలల్లో రెండుసార్లు చోరీకి పాల్పడిన ఈ డ్రిల్లింగ్​ దొంగలు చాకచక్యంగా తప్పించుకుంటు పోలీసులకు సవాల్​ విసురుతున్నారు.

theft by drilling doors at yellandu
ఇల్లందులో చోరీ

By

Published : Apr 27, 2020, 10:28 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో రెండేళ్ల క్రితం హల్​చల్​ చేసిన డ్రిల్లింగ్​ దొంగలు మళ్లీ తమ ఉనికి చాటుకుంటున్నారు. గడియ వేసి పడుకున్నా... తలుపునకు రంధ్రం చేసి మరీ ఇంట్లోకి చొరబడుతున్నారు. ఇళ్లు గుళ్ల చేస్తున్నారు. ఈరోజు ఉదయం రెండో నెంబర్​ బస్తీలోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి ఐదున్నర తులాల బంగారు గొలుసును దోచుకెళ్లారు.

పట్టణంలో మూణ్నెళ్లలో రెండు సార్లు డ్రిల్లింగ్​ దొంగలు చోరీలకు పాల్పడ్డారు. మరో రెండు సార్లు ఇంటి యజమానులను బెదిరించి బంగారు ఆభరణాలు దోచేసి చాకచక్యంగా తప్పించుకున్నారు. పోలీసులు వారికోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details