తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భలే దొంగలు.. గురజాడలో రూ.కోటి విలువగల ఆభరణాల చోరీ - గురజాడలో దొంగల హల్ చల్

ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో ఓ వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.కోటి విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

thieves-stolen-1-crore-value-gold-silver-at-gurajada-drishna-district
గురజాడలో రూ.కోటి విలువగల ఆభరణాల చోరీ

By

Published : Nov 24, 2020, 11:20 AM IST

ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన చల్లా రాజేశ్వరి అనే 70 ఏళ్ల మహిళ ఇంట్లో సుమారు రూ.కోటి విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

రాజేశ్వరి హైదరాబాద్​లో తన సోదరుని ఇంట్లో జరిగిన శుభ కార్యానికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. బీరువాలో దాచిన ఆభరణాలు మాయమైన విషయం గ్రహించిన రాజేశ్వరి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జాగిలాలు, క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు.

ABOUT THE AUTHOR

...view details