మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. సంస్కృతి టౌన్షిప్లలో వారం రోజుల వ్యవధిలోనే నాలుగు ఇళ్లను దోచేశారు.
టౌన్షిప్లో దొంగల హల్చల్.. వారంరోజుల్లో నాలుగు చోరీలు - medchal district crime news
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నాలుగు ఇళ్లను కొల్లగొట్టారు.
![టౌన్షిప్లో దొంగల హల్చల్.. వారంరోజుల్లో నాలుగు చోరీలు thieves-robbed-at-sanskruthi-township-in-ghatkesar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10099702-775-10099702-1609641782594.jpg)
ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దొంగల హల్చల్
లక్షల రూపాయలు మెయింటెనెన్స్ రూపంలో వసూల్ చేస్తున్న అసోసియేషన్ సభ్యులు.. భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదని టౌన్షిప్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీకెమెరాలున్నా.. కొన్ని సరిగ్గా పనిచేయడం లేదని తెలిపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు టౌన్షిప్ ప్రహరీని కూల్చివేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
దోపిడీ దొంగలు చోరీలు, హత్యలకు పాల్పడక ముందే సంబంధిత అధికారులు టౌన్షిప్ భద్రతపై దృష్టి సారించాలని కోరారు.