కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల బెడద ఎక్కువైంది. రెండు మూడు రోజుల నుంచి వరుసగా ఎక్కడో చోటా రోజూ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు జరిగాయి. తాళం వేసి ఉన్న ఒరగంటి బాలచంద్రం, ఒరగంటి లక్ష్మి, హర్షద్, మాలాద్రి ఇళ్లలో దొంగతనాలు జరిగాయి.
కామారెడ్డిలో దొంగల బెడద... పలు ఇళ్లల్లో చోరీలు
కామారెడ్డి జిల్లాలో దొంగలు చెలరేగిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దొంగల బీభత్సంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
కామారెడ్డిలో దొంగల బెడద... పలు ఇళ్లల్లో చోరీలు
సుమారు 16 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. లక్ష 5 వేలు, కోటి రూపాయలు విలువచేసే ల్యాండ్ డాక్యుమెంట్స్ దుండగులు అపహరించారు. కామారెడ్డి మండలం నరసన్నపల్లిలోని దేవి వైన్స్లో కూడా చోరీ జరిగింది. వైన్స్ షెట్టర్ తాళాలు పగులగొట్టి రూ. లక్ష నగదు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.