కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్లే వీళ్ల లక్ష్యమని పేర్కొన్నారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - Latest news in Telangana
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా... వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను బాన్సువాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు తులాల బంగారం, 4వేల నగదు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్
నిందితులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన కమ్మ అనిల్, ఆకాశ్, బాన్సువాడ పట్టణానికి చెందిన దాసరి తిరుపతిగా గుర్తించారు. వారి నుంచి ఆరు తులాల బంగారం, 4 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో 19 కేసులు ఉన్నాయని తెలిపారు.
ఇదీ చూడండి:'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'
Last Updated : Dec 22, 2020, 10:48 PM IST