హైదరాబాద్ గోల్కొండలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఒకరు మేజర్ కాగా.. మరో ఇద్దరు మైనర్లు. జతిన్(19), మరో ఇద్దరు మైనర్ స్నేహితులు కలిసి తరచుగా దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు.
గోల్కొండలో తరచూ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - thieves arrest in golconda limits
హైదరాబాద్ గోల్కొండలో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మైనర్లు , ఒక మేజర్ ఉన్న ముఠా వద్ద రూ. 2.3 లక్షల విలువైన సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
![గోల్కొండలో తరచూ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ 2 minors and a major arrested at golconda police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8234256-635-8234256-1596115918336.jpg)
గోల్కొండలో తరచూ చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
బుధవారం నాడు గోల్కొండ పీఎస్ పరిధిలో పాన్ డబ్బా వద్ద దొంగతనానికి యత్నిస్తుండగా.. పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. దొంగతనానికి వచ్చినట్లు వారు తెలుపగా.. గుట్టురట్టయింది. పోలీసులు వీరి నుంచి సుమారు రూ. 2.3 లక్షల విలువైన సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు ద్విచక్రవాహనాలను జప్తు చేశారు.
ఇదీ చూడండి:-యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!