తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తిరుమల నడక మార్గంలో భక్తులను వెంబడించిన దొంగలు - tirupathi latest news

తిరుపతి అలిపిరి నడక మార్గంలో తమను దోచుకోవటానికి దొంగలు వెంబడించారని భక్తులు ఫిర్యాదు చేశారు. డయల్ 100కి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే స్పందించి.. రక్షించినట్లు భక్తులు వెల్లడించారు.

ttd
ttd

By

Published : Jan 18, 2021, 8:35 AM IST

తిరుమలకు కాలినడకన బయలుదేరిన తమను అలిపిరి నడక మార్గంలో.. దొంగలు వెంబడించినట్లు భక్తులు ఫిర్యాదు చేశారు. కర్నూలుకు చెందిన సునీల్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన తిరుమలకు పయనయ్యారు. 2,830వ మెట్టు వద్దకు వచ్చేసరికి నలుగురు దొంగలు తమను దోచుకోవటానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

దొంగల నుంచి తప్పించుకోవటానికి పరుగులు పెట్టామనీ.. డయల్ 100కి ఫిర్యాదు చేయగా.. పోలీసులు వెంటనే స్పందించి, తమను రక్షించారని చెప్పారు. నడక మార్గంలో అక్కడక్కడ లైట్లు వెలగటం లేదని ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:గురుకులాల్లో పీజీ కోర్సులు.. 2020-21 నుంచే ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details