హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీ చేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన శివ సంజీవ షిండే... నిలోఫర్ ఆసుపత్రి సమీపంలో పాదబాటపై ఉంటారు. ఇటీవల ఎల్బీ స్టేడియం కార్యాలయం తలుపులు నెట్టి.. అందులో ఉన్న పలు ట్రోఫీలను చోరీ చేశాడు. వాటిని మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుని ఇంట్లో దాచారు.
ఎల్బీ స్టేడియంలో ట్రోఫీ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్ - thief who stole trophies at lb stadium was caught by police
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ట్రోఫీలను చోరీ చేసిన దొంగను సైఫాబాద్ పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. మొత్తం 15 ట్రోఫీలు పోయినట్లు ఫిర్యాదు రాగా.. మాంగార్ బస్తీలో తనకు తెలిసిన ఓ వృద్ధుని ఇంట్లో దాచిన 11 ట్రోఫీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![ఎల్బీ స్టేడియంలో ట్రోఫీ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్ trophies theif at lb stadium in hyderabad caught by police](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8501705-741-8501705-1597999039856.jpg)
ఎల్బీ స్టేడియంలో ట్రోఫీ దొంగతనం చేసిన వ్యక్తి అరెస్ట్
చోరీ విషయంపై అసోసియేషన్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. చోరీకి గురైన వాటిలో వెండి ట్రోఫీతో పాటు ఇత్తడి ట్రోఫీలు పదిహేను ఉన్నట్లు ప్రతినిధులు తెలిపారు. అయితే అక్కడ తెలుపు రంగులో ఉన్నవేవి దొంగలించలేదని తేలింది. పోలీసులు దొంగను రిమాండ్కు తరలించి.. అతని వద్ద నుంచి 11 ట్రోఫీలను స్వాధీనం చేసుకున్నారు.