హైదరాబాద్ లోయర్ట్యాంక్బండ్ డీబీఆర్ మిల్స్ కాలనీకి చెందిన విజయలక్ష్మి తెలుగు తల్లి కూడలిలోని ఓ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 50 వేలు డ్రా చేసుకుని ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి దానిని లాక్కొని పారిపోయాడు. విజయలక్ష్మి సైఫాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. దొంగ అరెస్ట్ - పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ
మనవరాలి పెళ్లి ఖర్చుల కోసం ఓ వృద్ధురాలు డబ్బులను డ్రా చేసి తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి.. దానిని లాక్కొని పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.
పెళ్లి ఖర్చులకు డ్రా చేసిన డబ్బులు చోరీ.. అరెస్ట్ చేసిన పోలీసులు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఆదర్శనగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి ఆచూకీ కోసం ప్రయత్నించారు. చోరీ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని నగదు సంచిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తల్లూరుకు చెందిన శ్రీరాంగా గుర్తించారు.