జనగామ జిల్లా కేంద్రంలో వృద్ధ మహిళలను ఎంపిక చేసుకుని.. గ్యాస్ కనెక్షన్లు మంజూరు అయ్యాయని నమ్మబలికి వారి వద్ద నుంచి నగదు వసూలు చేసి పారిపోతున్న రఘునాథపల్లికి చెందిన పర్వతం రాజు అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత సంవత్సరం జనగామ జిల్లా కేంద్రంలోని ఒక్క వృద్ధ మహిళను కత్తితో బెదిరించి 3 తులాల బంగారు గొలుసును అపహరించాడు. దీనితో నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 23 గ్రాముల బంగారంతో పాటు 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధ మహిళలే లక్ష్యంగా చోరీలు చేస్తున్న దొంగ అరెస్టు - crime news
ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను ఎంపిక చేసుకొని చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 80 వేల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు
వృద్ధ మహిళలే లక్ష్యంగా చోరీలు చేస్తున్న దొంగ అరెస్టు