తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఇళ్లలో అర్ధరాత్రి చోరీ.. వ్యక్తి అరెస్ట్ - balanagar police arrested a thief

భాగ్యనగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతోన్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పలు విలువైన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Thief arrested by balanagar police for burglary in the city
నగరంలో చోరీలకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్

By

Published : Oct 6, 2020, 11:51 AM IST

హైదరాబాద్​లోని ఇళ్లలో అర్ధరాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్న దొంగను బాలానగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి వద్ద నుంచి కిలోన్నర వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం, రెండు ఖరీదైన వాచీలు, రెండు సెల్​ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ఇప్పటి వరకు నగరంలోని 4 ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. పలు వాహనాలు సైతం దొంగిలించినట్లు తెలిపారు. నిందితుడు గతంలోనూ 26 దొంగతనాలకు పాల్పడటంతో పీడీ యాక్ట్​పై జైలుకు వెళ్లొచ్చినట్లు వివరించారు. ఈ మేరకు నిందితుడిని రిమాండ్​ తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. ముమ్మరంగా గాలింపు

ABOUT THE AUTHOR

...view details