తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉన్నదంతా ఊడ్చాడు.. కానీ గుళ్లోనే దొరికాడు! - తుకారాంగేట్​ పహాడి హనుమాన్​ దేవాలయంలో చోరీ యత్నం వార్త

సికింద్రాబాద్​లో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన తుకారాంగేట్​ పహాడి హనుమాన్​ దేవాలయంలో చోరీకి విఫల యత్నం జరిగింది. గమనించిన స్థానిక యువకులు పోలీసులకు ఫోన్​ ద్వారా సమాచారం ఇవ్వగా.. గుళ్లోనే దాగి ఉన్న దొంగ ఎంచక్కా పట్టుబడ్డాడు.

thief arrest at Tukaram gate hanuman temple
ఉన్నదంతా ఊడ్చాడు.. గుళ్లోనే దొరికాడు

By

Published : Jan 1, 2021, 8:01 PM IST

హైదరాబాద్​లోని సికింద్రాబాద్​లో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన తుకారాంగేట్​ పహాడి హనుమాన్​ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. డిసెంబరు 31న మధ్యరాత్రి రెండు గంటల సమయంలో ఓ దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. రెండు హుండీల తాళాలు పగలగొట్టి ఉన్నదంతా దోచుకున్నాడు.

శబ్దాలు గమనించి..

అయితే ఆలయంలో నుంచి వస్తున్న శబ్దాలును దగ్గర్లోని బోయబస్తీ యువకులు గమనించారు. పోలీసులకు ఫోన్​ చేసి.. దాదాపు ముప్పై మంది యువకులు కర్రలు పట్టుకొని ఆలయాన్ని చుట్టుముట్టారు. బయట యువకుల్ని చూసిన దొంగ ఏం చేయాలో తోచక ఆలయ గర్భగుడిలోనే తలదాచుకున్నాడు.

గర్భగుడి వెనుక దాక్కొని..

ఆలయాన్ని చేరుకున్న పోలీసులు ప్రాంగణంలో దొంగ కోసం గాలించగా అతడు కనిపించలేదు. దొంగ గుడిలోనే ఉన్నాడని బస్తీయువకులు పోలీసులకు చెప్పగా.. గుడి లోపలికి వెళ్లి గాలించారు. గర్భగుడి వెనుక దాక్కొని ఉన్న దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. దొంగ తుకారాంగేట్​కు చెందిన వ్యక్తిగా బస్తీవాసులు గుర్తించారు.

వారం రోజుల ముందే ఈఓకు ఫిర్యాదు చేశాం..

"తుకారాంగేట్​లోని పహాడి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గతంలో అనేక సార్లు దొంగలు పడ్డారని, గుడికి భద్రత కల్పించాలని వారం రోజుల ముందే ఈఓకు ఫిర్యాదు చేశాం. ఆలయంలోని సీసీ పుటేజీలు పనిచేయడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆలయానికి రక్షణ కల్పించాలి"

-కలకంట్ల హరి. భాజపా గ్రేటర్ నాయకుడు

ఇదీ చూడండి:రాజస్థాన్​లో కొత్త వైరస్- 100 కాకులు మృతి

ABOUT THE AUTHOR

...view details