వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని దీన్‌దయాల్ నగర్‌కు చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు గన్నారపు వనిత (44) కొవిడ్ టీకా వేయించుకొని మరణించిందంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ఇటుకలు మోస్తున్న సమయంలో గుండె పోటు రావడంలోనే ఆమె మృతి చెందిందని పేర్కొన్నారు.
'కొవిడ్ టీకా వికటించిదన్న వార్తలో వాస్తవం లేదు' - వరంగల్‌లో అంగన్వారడీ ఉపాధ్యాయురాలు మృతి
వారం రోజుల క్రితం కొవిడ్ టీకా వేయించుకున్న వనితా అనే అంగన్వాడీ కార్యకర్త మృతి చెందడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఇంటి నిర్మాణం కోసం ఇటుకలు మోస్తుండగా ఒక్కసారిగా కింద పడి విలవిల్లాడుతూ చనిపోయింది. అయితే గుండెపోటు కారణంగానే ఆమె చనిపోయిందని.. వ్యాక్సిన్ వికటించిందన్న వార్తలో వాస్తవం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
'కొవిడ్ టీకా వికటించిదన్న వార్తలో వాస్తవం లేదు'
వారం రోజుల క్రితం సహా ఉద్యోగులతో కలిసి వనిత కోవిడ్ టీకా వేయించుకుంది. టీకా వికటించడం కారణంగానే ఆమె చనిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వాస్తవం కాదని బంధువులు తేల్చారు. ఆమెకు గతంలోనే ఒకసారి గుండె పోటు వచ్చిందని సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త ఇప్పటికే చనిపోగా ఒక కూతురు ఉంది.
ఇదీ చదవండి:తహసీల్దార్ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి