బెంగళూరుకు చెందిన ఆర్కెస్ట్రా సింగర్ అర్చన ముంబయి, కోల్‌కతా, బెంగళూరులతోపాటు హైదరాబాద్‌లోనూ చోరీలకు పాల్పడినట్లు పోలీస్ విచారణలో తేలింది. 2019 ఏప్రిల్‌లో సెంట్రల్ ముంబయిలోని ప్రఖ్యాత మాల్‌లో జరిగిన చోరీపై అందిన ఫిర్యాదుతో కూపీ లాగగా అర్చన నిందితురాలన్న విషయం బయటకొచ్చింది. అంతకుముందు దాదర్‌లో ఓ మాల్‌తోపాటు బ్యూటీపార్లర్‌లోనూ ఇదే తరహాలో చోరీలు జరగడంతో ఆ దిశగా దర్యాప్తు సాగించారు.
విమానాల్లో వస్తుంది.. చోరీ చేసి వెళ్తుంది.. - Bangalore Khiladi entangled with the Mumbai Crime Branch
ఆమె బెంగళూరులో ఆర్కెస్ట్రా సింగర్.. కానీ మెట్రో నగరాల్లోని పేరుమోసిన షాపింగ్ మాళ్లను, బ్యూటీపార్లర్లనే లక్ష్యంగా చేసుకొని వినియోగదారుల బ్యాగ్‌లు అపహరించడంలో సిద్ధహస్తురాలు. చోరీలు చేసేందుకు విమానాల్లో మాత్రమే ప్రయాణించడం ఆమె ప్రత్యేకత. పదేళ్లుగా ఆ సింగర్ కొనసాగిస్తున్న దొంగతనాల గుట్టును ముంబయి పోలీసులు తాజాగా బయటపెట్టారు.
విమానాల్లో వస్తుంది.. చోరీ చేసి వెళ్తుంది
సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌టవర్ లొకేషన్‌లను విశ్లేషించి ఆమె చిత్రాల్ని సేకరించారు. ఫేస్‌బుక్‌లో ఆమె చిత్రాలను పరిశీలించారు. దీంతో చోరీలు అర్చన నిర్వాకమేననే నిర్ధారణకు వచ్చారు. రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లి ఆమెను అరెస్ట్ చేశారు. 2009 నుంచి ఇలా చోరీలు చేస్తున్నట్లు ఆమె అంగీకరించింది. హైదరాబాద్‌లో ఆ సింగర్ చేసిన చోరీల గురించి తెలంగాణ పోలీసులకు ముంబయి పోలీసులు సమాచారం అందించారు. త్వరలోనే ఆమెను పీటీ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశముంది.