సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో శనివారం రాత్రి చోరీకి గురైన ఇండి క్యాష్ ఏటీఎం ఆచూకీ లభ్యమైంది. ఏటీఎం దొంగలించిన ఐదుగురు దుండగులకు దాన్ని ఎలా తెరవాలో తెలియలేదు. వేరే దారిలేక కంది మండలం చేర్యాల శివారు ప్రాంతాల్లో వదిలి వెళ్లిపోయారు. దుండగుల కోసం వెతుకుంటూ వెళ్లిన పటాన్చెరు పోలీసులకు ఈ ఏటీఎం కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నగదు ఎక్కడికి పోలేదని స్పష్టం చేశారు. దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తెరవడం తెలియక వదిలేశారు.. - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు
పక్కా ప్రణాళికతో ఏటీఎం దొంగతనం చేశారు. ఊరి చివరకు వెళ్లాక డబ్బు బయటకు తీసి పంచుకోవాలనుకున్నారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఎత్తుకెళ్లిన ఏటీఎం నుంచి డబ్బు ఎలా బయటకు తీయాలో ఒక్కరికి తెలియలేదు. చేసేదేం లేక ఏటీఎంను పొదల్లో పడేసి పరారయ్యారు.
చోరీకి గురైన ఏటీఎం ఆచూకీ లభ్యం