భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని తాళ్ల గోమ్మూరు గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హుండీలో నగదును దోచుకెళ్లారు.
తాళాలు పగలగొట్టి ..

వేకువజామున అర్చకులు వచ్చి చూడగా.. ఆలయ తలుపుల తాళాలు పగలగొట్టి హుండీ చోరీ చేసినట్లు గమనించారు. జరిగిన విషయం గ్రామస్థులు, పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న కొత్తగూడెం పోలీసులు క్లూస్ టీంతో వచ్చి ఆధారాలు సేకరించారు. ఈ చోరీలో సుమారు లక్ష రూపాయలు నగదును దుండగులు కాజేసినట్లు అర్చకులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:సాయంత్రం కొవాగ్జిన్ టీకా తరలింపు ప్రక్రియ