హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న దొంగను వెస్ట్‌జోన్ కార్యదళం పోలీసులు పట్టుకున్నారు. నాలానగర్ వద్ద టీ స్టాల్ నిర్వహించే మహమ్మద్ ఖాన్(20) ఈ చోరీలకు పాల్పడ్డాడు.
మత్తుకు బానిసై ద్విచక్రవాహనాల చోరీ - bike thief arrested by task force police
మొదట టీ అమ్ముతూ జీవనం సాగించేవాడు. తర్వాత స్నేహితులతో కలిసి గంజాయికి అలవాటుపడ్డాడు. టీ అమ్మితే వచ్చే డబ్బులు సరిపోక బైకుల చోరీకి తెరతీశాడు. లంగర్‌హౌజ్ పీఎస్ పరిధిలో ద్విచక్రవాహనాలు దొంగిలించి ఆఖరికి పోలీసులకు చిక్కాడు.
మత్తుకు బానిసై ద్విచక్రవాహనాల చోరీ
లంగర్‌హౌజ్‌లోని తన స్నేహితులతో కలిసి గంజాయి సేవించేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై డబ్బులు సరిపోక బైకుల దొంగతనానికి పాల్పడ్డాడు. నిర్మానుష్య ప్రదేశాల్లో నిలిపిన వాహనాలే లక్ష్యంగా చోరీలు చేసేవాడు. సమాచారం అందుకున్న కార్యదళం పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లంగర్‌హౌజ్ ఠాణాలో అప్పగించి, రిమాండుకు తరలించారు.