తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దర్జాగా వైన్స్​లో దొంగతనం.. వెళ్తూ వెళ్తూ ఓ ఖరీదైన... - telangana news

ఓ వైన్స్​లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ. లక్షా 80 వేల నగదు లూఠీ చేశారు. ఇక్కడిదాకా వచ్చి ఖాళీగా వెళ్లడం ఎందుకు అనుకున్నారో ఏమో.. కొసమెరుపుగా వెళ్తూ వెళ్తూ ఓ ఖరీదైన మద్యం బాటిల్​ని కూడా ఎత్తుకెళ్లారు.

theft-in-wines-in-sangareddy
దర్జాగా వైన్స్​లో దొంగతనం.. వెళ్తూ వెళ్తూ ఓ ఖరీదైన...

By

Published : Jan 9, 2021, 10:01 PM IST

దర్జాగా వైన్స్​లో దొంగతనం.. వెళ్తూ వెళ్తూ ఓ ఖరీదైన మద్యం బాటిల్ కూడా

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ దుర్గ భవాని వైన్స్​లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. రూ. లక్షా 80 వేల నగదు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున 3:15 నిమిషాల నుంచి 20 నిమిషాలలోపు దొంగలు చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్​లో రికార్డు అయ్యాయి.

ఆరుగరు దొంగలు మారుతి వ్యాన్​లో వచ్చి వైన్స్ షట్టర్​ను దర్జాగా పైకెత్తి కౌంటర్​లోని నగదును అపహరించారు. వెళుతూ వెళుతూ ఒక ఖరీదైన మద్యం బాటిల్​ను వెంట పట్టుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు.. హద్నూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి:ఏమై ఉంటుంది?: రైల్వే ట్రాక్​పై అన్నదమ్ముల మృత్యువాత

ABOUT THE AUTHOR

...view details