తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వైన్స్​ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది - తెలంగాణ వార్తలు

ఆ వైన్స్​లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పెట్టె బాగా నిండింది. అదే అదును అనుకున్నాడు ఓ దొంగ. రాత్రిపూట షటర్‌లేపి ఉన్న డబ్బునంతా ఊడ్చేశాడు.

theft in wines at jagtial district regunta
వైన్స్​ పెట్టె నిండింది.. దొంగ కన్ను పడింది

By

Published : Jan 18, 2021, 12:33 PM IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర వైన్స్​లో దొంగతనం జరిగింది. నిన్న ఆదివారం కావటంతో.. గ్రామంలో ఉన్న మద్యం దుకాణంలో పెద్ద ఎత్తున విక్రయాలు సాగాయి. డబ్బు బాగా రావడం చూసి దొంగ దానిపై కన్నేశాడు.

అర్ధరాత్రి దాటాకా.. చాకచక్యంగా వైన్స్‌ షటర్​ను పైకి లేపి కౌంటర్లో ఉన్న సుమారు రూ. 6 లక్షల నగదును అపహరించుకు పోయాడు. దుకాణంలో ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. దుకాణంలో ఉన్న డబ్బులతో పాటు మద్యం సీసాలను కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక ఎవరైనా హత్య చేశారా..?

ABOUT THE AUTHOR

...view details