మద్యం దుకాణంలో 25వేల నగదు, 10వేల విలువైన మద్యం సీసాలు అపహరించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర వైన్స్‌ను రోజూలాగే ఉదయం పదిన్నర గంటలకు షట్టర్ తీసి చూడగా కౌంటర్ తెరిచి ఉందని తెలిపారు. దీంతో పాటు షాపు వెనుక భాగం నుంచి తలుపుకు కన్నం చేసి ఉందని పోలీసులకు సమాచారం అందించారు.
మోత్కూరులోని వెంకటేశ్వర మద్యం దుకాణంలో చోరీ - మద్యం దుకాణంలో చోరీ
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. దొంగలు షాపులోకి చొరబడి.. 25వేల నగదు, 10వేల విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోత్కూరులోని వెంకటేశ్వర మద్యం దుకాణంలో చోరీ
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: దుబ్బాకలో దారుణం.. ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి