మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్ళల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మొదటి ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లభించకపోటంతో.. పక్కనే ఉన్న మరో ఇంట్లో చొరబడ్డారు. ఇంటి తలుపులు తీసి ఉండటంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చి చూడగా.. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా కనిపించాయి. వెంటనే వారు ఇంటి యజమాని అమీనాభికి ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. ఆమె విజయవాడలోనే ఉన్నట్లు తెలపగా.. పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ సీఐ వెంకటరత్నం, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. 45 వేల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు బీరువాలో ఉన్నాయని యజమాని ఫోన్లో తెలిపింది.
తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీ - mahabubabad district crime news
తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. మొదటి ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లభించకపోటంతో మరో ఇంట్లో చొరబడ్డారు. ఆ ఇంటి యజమాని అందుబాటులో లేకపోవటంతో.. వారు వస్తేగాని పూర్తి సమాచారం తెలువనుంది.
తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో చోరీ